మరికొద్ది రోజుల్లో వాలెంటైన్స్ డే.. ముద్దులు పెడుతూ లవ్ మ్యాటర్ ని బయటపెట్టిన త్రిష..సంధింగ్ మోర్ స్పెషల్..!

మరి కొద్ది రోజుల్లోనే వాలెంటైన్స్ డే రాబోతుంది . ఈ క్రమంలోనే వాలెంటెన్స్ డే ను స్పెషల్ గా జరుపుకోవడానికి ప్రేమికులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కొంతమంది వాలెంటైన్స్ డే కి పది రోజులు ముందు నుంచే ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ అంటూ రకరకాల గిఫ్ట్ తో ఇచ్చి పుచ్చుకుంటున్నారు . రీసెంట్గా హీరోయిన్ త్రిష వాలెంటైన్స్ డే కి కొన్ని రోజుల ముందే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది .

మనకు తెలిసిందే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా త్రిషకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు . సెకండ్ ఇన్నింగ్స్ లోను ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . హీరోయిన్ త్రిష రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా ఫైనలైజ్ అయింది . కాగా ఇలాంటి క్రమంలో త్రిష తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది . తన పెట్ డాగ్ తో ముద్దులు పెడుతూ హగ్ చేసుకుని ఉన్న ఫొటోస్ ను షేర్ చేస్తూ ..తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది . సంథింగ్ మోర్ స్పెషల్ అంటూ కూడా రాసుకోచ్చింది.

దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా 40ఏళ్లు దాటుతున్న సరే త్రిష ఇంకా పెళ్లిపై ఆలోచన చేయలేదు. గతంలో టాలీవుడ్ హీరోను ప్రేమించింది అని వార్తలు వచ్చిన అవి అక్కడితోనే ఆగిపోయాయి. ఆ తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ తో నిశ్చితార్థం చేసుకుని పెళ్లి వరకు వెళ్ళింది. కానీ అక్కడే ఆగిపోయింది. అసలు త్రిష పెళ్లి చేసుకుంటుందో లేదో కూడా తెలియదు..?