టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల ఫేవరెట్ హీరోలు వీళ్లే.. ఏ డైరెక్టర్ కు ఎవరు ఇష్టమంటే..?

సాధారణంగా హీరోలకి ఫ్యాన్స్ ఉండడం కామన్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే అభిమానం ఉంటుంది. కొందరు ప్రభాస్ ని ఇష్టపడితే.. మరి కొందరు జూనియర్ ఎన్టీఆర్, మరికొందరు చరణ్, అల్లు అర్జున్ ఇలా ఎవరికి నచ్చిన వారిని వారు ఫేవరెట్ హీరోగా భావిస్తూ ఉంటారు. అయితే కేవలం అభిమానులకు మాత్రమే కాకుండా కొంతమంది డైరెక్టర్లకు కూడా ఫేవరెట్ హీరోస్ ఉంటారు. అలా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో ఏ డైరెక్టర్ కు ఏ హీరో అంటే ఇష్టమో ఒకసారి తెలుసుకుందాం.

పాన్‌ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆయనా ఇప్పటికీ తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ వివరించాడు. అలాగే స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అట‌. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ప‌లు సినిమాలు రిలీజ్ అయి సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం వీరి కాంబోలో పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఇక టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలతో కలిసి పనిచేసిన.. తన ఫేవరెట్ హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే వంశీ పైడిపల్లి ఫేవరెట్ హీరో మహేష్ బాబు అంటూ వివరించాడు. ఇక సుజిత్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు నేను వీరాభిమానిని ఆయనే దేవుడులా కొలుస్తా అంటూ చెప్పుకొచ్చాడు.