తారక్ ” దేవర ” షూటింగ్ పై అదిరిపోయే అప్డేట్..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తారక్ తాజాగా హీరోగా నటిస్తున్న మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ మూవీ త్రిబుల్ ఆర్ మూవీ అనంతరం రావడంతో ఈ సినిమాపై భారీ హైప్స్ నెలకు ఉన్నాయి. ఇక ఈ భారీ చిత్రం రిలీజ్ పట్ల కూడా అంతా ఆశక్తి నెలకోగా ప్రస్తుతం షూటింగ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు కంప్లీట్ కాగా రీసెంట్గా మాత్రం కొంచెం గ్యాప్ తీసుకున్నారు మేకర్స్. ఈ గ్యాప్ తర్వాత ఈ మార్చ్ 14 నుంచి మేకర్స్ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ఇందులో కొంతమేర టాకి పార్ట్ ని సహ కొన్ని యాక్షన్ సీన్స్ లను కూడా తెరకెక్కించనున్నారట. అదేవిధంగా సాంగ్ షూట్ మాత్రం బ్యాలెన్స్ ఉందట. మరి దేవర షూటింగ్ ఎప్పటికీ కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి మరి. ఇక ఈ భారీ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ కలిపి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.