నాని ” సరిపోదా శనివారం ” మూవీ రిలీజ్ డేట్ షెడ్యూల్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే…!

ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇక ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు.

ఇక కొత్త కొత్త సబ్జెక్టులతో అలరించే నాని ఈ మూవీ అనంతరం కెరీర్ 31వ సినిమాని దర్శకుడు వివేక్ తో అనౌన్స్ చేశాడు. ఆ సినిమాకి సరిపోదా శనివారం అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాపై నేచురల్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారని మేకర్స్ ఓ డేట్ ని కూడా ఫిక్స్ చేసినట్లు బజ్ వినిపిస్తుంది. మేకర్స్ ముందుగా అయితే ఆగస్టు 15 డేట్ ని లాక్ చేశారు అని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ డేట్ లో ఉన్న భారీ చిత్రం పుష్ప 2 ఒకవేళ రాకపోతే ఈ డేట్ ని లాక్ చేసుకోగా.. ఇక ఒకవేళ పుష్ప 2 వస్తే మరో డేట్ ని అనుకున్నారట. అదే ఆగస్టు 29. ఇక పుష్ప రిలీజ్ డేట్ పై సరిపోదా శనివారం మూవీ కూడా ఆధారపడి ఉంది.