వాట్ : డైరెక్టర్ కాకముందు అనిల్ రావిపూడి సినిమాల్లో కూడా నటించాడా.. ఆ సినిమా ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా రాణించాలంటే అందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అహర్నిశలు సినిమా కోసమే శ్రమించాల్సి ఉంటుంది. అలా ఆయన రూపొందించిన ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుంటూ టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా క్రేజ్‌ సంపాదించుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన తెర‌కెక్కించిన రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 1, ఎఫ్ 2, ఎఫ్ 3సిరీస్ లు.. ఇటీవల బాలయ్యతో భగవంత్‌ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఈ సినిమాల ద్వారా డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకున్న అనిల్.. డైరెక్టర్ కాకముందు పలు సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఆ విషయం చాలామందికి తెలుసు. అయితే ఈయన పలు సినిమాల్లో నటించిన ఓ వీడియో నెట్టింట‌ వైరల్ అవుతుంది. ఇంతకీ అనిల్ రావిపూడి ఏ సినిమాలో నటించారు.. ఏంటో ఒకసారి చూద్దాం. సినిమాటోగ్రాఫర్ గా మంచి పాపులారిటీ దక్కించుకుని డైరెక్టర్ గా మారాడు శివ‌. గోపీచంద్ తో శౌర్యం సినిమా తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో గోపీచంద్ స‌ర‌సన అనుష్క నటించగా.. హీరో చెల్లెలి పాత్రలో పూనామ్ కౌర్ కనిపించింది. 2008లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించిన ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో అనిల్ రావిపూడి కనిపించారు.

Super Sampangi🌶️ on X: "gopichand shankam movie lo anil ravipudi cameo https://t.co/0H5zxO0xgD" / X

ఈ సినిమాల్లో గోపీచంద్ విలన్ కు ఒక డేంజరస్ డ్రగ్ ఇచ్చి తనని హాస్పిటల్స్ మొత్తం తిప్పుతూ ఉంటాడు. అలా ప్రతి హాస్పిటల్‌కి ఆయన వెళ్తున్న నేపథ్యంలో హాస్పిటల్ లో అనిల్ రావిపూడి రిసెప్షనిస్ట్‌గా ఉంటూ అమ్మాయిలతో పులిహార కలుపుతుంటాడు. విలన్ అక్కడికి వెళ్లి ల్యాబ్ ఎక్కడ అని అడగగా.. ఫస్ట్ ఫ్లోర్ ముందు ఈ ఫామ్ ఫిల‌ప్ చేయండి అని ఒకసారి మాట్లాడుతూ కనిపిస్తాడు. అలాగే గోపీచంద్ నటించిన శంఖం సినిమాలో కూడా అనిల్ రావిపూడి ఓ కామియో రోల్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.. అనిల్ రావిపూడి అసిస్టెంట్ డైరెక్టర్గా, డైరెక్టర్ గానే కాకుండా నటుడుగా కూడా సినిమాల్లో కనిపించాడా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా అనిల్ రావిపూడినే వ్యవహరించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.