గీత ఆర్ట్స్ బ్యానర్ లో గీత అంటే ఎవరో తెలుసా.. ? ఆ పేరు వెనుక అసలు సీక్రెట్ ఇదే..

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు తెరకెక్కి సక్సెస్ సాధించాయి. గీత ఆర్ట్స్ తో పాటు గీత ఆర్ట్స్ 2ను కూడా నిర్మించి ఆ బ్యానర్ పై కూడా చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు అల్లు అరవింద్. 1974లో బంట్రోతు భార్య అనే మూవీతో గీత ఆర్ట్స్ బ్యానర్ స్టార్ట్ చేశారు. అయితే అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ కు ఈ పేరు ఎందుకు పెట్టారో గ‌తంలో వివరించారు.

Geetha Arts Mega Hits with Non Mega Heroes | cinejosh.com

గీత ఆర్ట్స్ బ్యానర్ లో గీత అనే పేరుకు వెనుక ఉన్న సీక్రెట్ రివిల్ చేశాడు అల్లు అరవింద్‌. ప్రముఖ కమెడియన్ ఆలీ నిర్వహించిన ప్రోగ్రాంలో అల్లు అరవింద్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో అసలు గీత ఆర్ట్స్ అని ఎందుకు పేరు పెట్టారు. గీత అంటే ఎవరు అని ప్రశ్నించగా దానికి అల్లు అరవింద్ న‌వ్వుతూ నా గర్ల్ ఫ్రెండ్ పేరు గీత అని వివరించారు. కానీ అందుకు తమ ప్రొడక్షన్ హౌస్ కు ఆ పేరు పెట్టలేదు అని సరదాగా చెప్పుకొచ్చాడు. తన సంస్థకు ఏ పేరు పెడదామని అల్లు రామలింగయ్య ఆయన పార్ట్నర్స్ ఆలోచిస్తున్న టైం లో.. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పేరును చెప్పారట.

Allu aravind: 'గీతాఆర్ట్స్‌'లో 'గీత' వెనుక కథ అదే.. అందుకే ఆ పేరు పెట్టాం:  అల్లు అరవింద్‌ | alitho saradaga interview with allu aravind part two

గీత అంటే భగవద్గీత అని అర్థం. అందులో సూచించిన‌ట్లే ప్రయత్నం మాత్రమే చేయాలి. ప్రతిఫలం మన చేతిలో ఉండదు. కష్టపడడం వరకే మన చేతిలో ఉంటుంది.. రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అందుకే గీత ఆర్ట్స్ అని మా బ్యానర్ కు పేరు పెట్టాం అంటూ అల్లు అరవింద్ వివరించారు. నిర్మాతగా నువ్వు చేయాల్సింది నువ్వు చేయడమే తప్ప.. రిజ‌ల్ట్ నీ చేతిలో ఉండదు అన్న విధంగా సంస్థకు గీత ఆర్ట్స్‌ పేరు పెట్టామంటూ వివరించాడు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.