రకుల్ ప్రీత్ పెళ్లి కార్డ్ లో ఈ మిస్టేక్స్ గమనించారా..? ఇంత పెద్ద తప్పు ఎలా చేసింది..?

త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పోపులారిటీ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . కాగా రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ కార్డు కూడా నెట్టింట వైరల్ గా మారింది . తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుంది అన్న వార్త అభిమానులకి ఆనందకరంగా అనిపించిన మరి కొంతమంది జనాలు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు . కొందరు వెటకారంగా ఎన్నో నెంబర్ బాయ్ ఫ్రెండ్ వీడు అంటుంటే .. మరికొందరు ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకునే మూడొచ్చిందా..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు .

 

కాగా అలాంటి జనాలే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కార్డుపై కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కార్డు చాలా స్టైలిష్ గా ట్రెండిగా డిజైన్ చేయించుకుంది . ఒకప్పుడు పెళ్లి పత్రికలు చాలా పద్ధతిగా ప్రింట్ చేసేవాళ్ళు . ఇప్పుడు మాత్రం అంత మోడరన్ టెక్నాలజీ గ్రాఫిక్స్ తో ఆకట్టుకునేస్తున్నారు. రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కార్డులో కొబ్బరి చెట్లతో గోవా లొకేషన్స్ గోవా అందాలను ఇంపార్టెన్స్ ఇస్తూ పెళ్లి కార్డు డిజైన్ చేయించుకుంది . అంతేకాదు ఈ పెళ్లి కార్డు గ్రీన్ బ్లూ ధీమ్ లో డిజైన్ చేయించుకుంది .

కాగా కొంతమంది ఈ పెళ్లి పత్రికలో తప్పులను వెతుకుతున్నారు . ఈ పెళ్లి పత్రిక చూడడానికి బాగానే ఉన్నా కానీ పెళ్లి పత్రికలా లేదని ..ఏదో హనీమూన్ కి ఇన్వైట్ చేస్తున్న పిక్చర్లా ఉందని.. ఆ గ్రీనరీ ఆ లొకేషన్స్ అదే విధంగా ఉన్నాయి అని.. పెళ్లి అంటే ఒక స్పెషల్ వైబ్ ఉంటుంది అని.. ఆ వైబ్ మీ పెళ్లి కార్డులో మిస్సయిందని చెప్పుకొస్తున్నారు. మరికొందరు రకుల్ ప్రీత్ సింగ్ కి పెళ్లి కన్నా హనీమూన్ ఇంపార్టెంట్ అని ఆ కారణంగానే ఇలాంటి ధీమ్ చూస్ చేసుకుంది అని ట్రోల్ చేస్తున్నారు . జనాలు కావాలని ఆమెను ట్రోల్ చేస్తున్నారు అంటూ రకుల్ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు. పెళ్లి అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని ఆ పెళ్లిని ఆమెను ప్రశాంతంగా చేసుకొని ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు..!!