“యస్..అది నిజమే”..ఫ్యాన్స్ కి తీపి కబురు చెప్పిన ఉపాసన.. అభిమానులకి మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్..!!

ఫైనల్లీ .. అందరూ అనుకున్నదే జరిగింది. మెగా కోడలు ఉపాసన గుడ్ న్యూస్ అభిమానులకి అందించింది. పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా.. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన .. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే . ఆమె చేసిన సేవ కార్యక్రమాలు ఎన్నో..ఎంత చెప్పుకున్నా తక్కువే. అభిమానులకి ఫ్యాన్స్ కి జనాలకి ఉపయోగపడే అంశాలను ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా చెప్పుకొస్తూ ఉంటుంది ఉపాసన.

అలాగే తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా చెప్పుకొస్తూ ఉంటుంది . రీసెంట్గా క్లీం కారాకు జన్మనిచ్చిన ఉపాసన తల్లి బాధ్యతలు తీసుకొని తన లైఫ్ ని చక్కగా ముందుకు తీసుకెళ్తుంది . రీసెంట్గా క్లీం కారాకు ఇద్దరు ట్విన్ సిస్టర్స్ పుట్టారు అంటూ ఉపాసన ప్రకటించింది. ఉపాసన సిస్టర్ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది అని క్లీంకారకు ఇప్పుడు ఇద్దరు అందమైన సిస్టర్స్ వచ్చారు అని.. ఆ ఫ్యామిలీ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది .

గతంలో ఉపాసన తన సిస్టర్ ప్రెగ్నెంట్ అన్నప్పుడు కూడా చాలామంది మళ్లీ మీ ఇంటికి కూతుర్లే వస్తారు.. మహాలక్ష్మిలే వస్తారు అంటూ చాలామంది జనాలు కామెంట్ చేశారు. ఫైనల్లీ అదే జరిగింది. అందరు అనుకున్నట్లు ఉపాసనకు ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారు . ప్రెసెంట్ ఉపాసన షేర్ చేసుకున్న ఫోటో వైరల్ గా మారింది. ట్రెడిషినల్ లుక్స్ లో ఉపాసన -రామ్ చరన్- క్లీం కార చాలా ముద్దుగా ఉన్నారు..!
!