“అది లేని అబ్బాయే నాకు కావాలి”.. శ్రీలీల టూ బోల్డ్ కామెంట్స్ వైరల్(వీడియో)..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయం కూడా పెద్ద భూతద్దంలో చూసినట్లు చేస్తున్నారు జనాలు . మరి కొంతమంది టాప్ హీరోయిన్స్ ని బాగా ట్రోలింగ్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్ అయిందో మనకు తెలిసిందే . పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల తెలుగులో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ అందుకుంది .

అంతేకాదు తనదైన స్టైల్ లో డాన్స్ చేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకునేసింది. రీసెంట్గా శ్రీ లీల నటించిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమాలో ఆమె డాన్స్ ఇరగదీసేసింది . అయితే ట్రోలింగ్ మాత్రం ఎదుర్కోక తప్పలేదు . రీసెంట్గా పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ ఒరిజినల్ అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాం ని మొదలుపెట్టింది. ఈ ఇంటర్వ్యూను సౌమ్య హౌస్ట్ చేస్తుంది . ఈ ఇంటర్వ్యూకి మొదటి గెస్ట్ గా వచ్చింది శ్రీ లీల . చాలా సరదా సరదా జోకులతో ..ఫన్నీ టాస్క్లతో ఈ ఎపిసోడ్ ని కంప్లీట్ చేసినట్లు ప్రోమో ఆధారంగా తెలుస్తుంది .

అయితే ఈ ప్రోమోలో మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా..? లేక ఫన్నీ జోవియల్ గా ఉండే అబ్బాయి కావాలా ..? అని సౌమ్య శ్రీ లీలను అడుగుతుంది . “బ్రెయిన్ తో ఏం చేసుకుంటాను ..నేను చూసుకుంటాలే ..ఫన్నీ జోబియల్ గా ఉండే అబ్బాయి కావాలి” అంటూ ఆన్సర్ ఇచ్చింది. దీంతో జనాలు మరోసారి శ్రీలీల ను ట్రోల్ చేస్తున్నారు . అంటే ఇన్ డైరెక్ట్ గా నీకు బ్రెయిన్ లేని అబ్బాయి కావాలి అంటున్నావ్ ఓకే ఓకే అలాంటి అబ్బాయిలు చాలామంది ఉన్నారులే.. అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు . త్వరలోనే ఈ ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ కాబోతుంది . ప్రోమో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది..!!