ధనుష్ – నాగార్జున మూవీ ఓవర్సీస్ రేట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.‌.!

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి.. అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై ప్రస్తుతం నాగార్జున మరియు ధనుష్ లతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. DNS అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది.

ముందుగా ముంబైలోని ధారావి.. అలానే తిరుపతిలో పలు కీలక సీన్స్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో డాన్ క్యారెక్టర్ లో నాగార్జున కనిపించనున్నట్లు సమాచారం. ఇక అసలు మేటర్ లోకి వెళితే.. ఈ మూవీ యొక్క ఓవర్సీస్ రేట్స్ ని ప్రముఖ సమస్త డ్రీమ్జ్ ఎంటర్టైన్మెంట్ వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ ప్రాజెక్ట్ పై ఇటు ధనుష్ అభిమానులతో పాటు అటు నాగార్జున అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. ఇక నాగార్జున నా సామి రంగ వంటి సినిమా బ్లాక్ బస్టర్ అనంతరం ఈ మూవీ లో నటించడంతో మరిన్ని హైప్స్ నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో కనుక వీరిద్దరూ హిట్ కొడితే వీరిద్దరూ కాంబినేషన్లో మరిన్ని సినిమాలు తెరకెక్కే అవకాశం ఉంది.