చిన్నప్పుడు దానిని అమ్మ, నన్ను నాన్న అని ఊహించుకున్న.. నాని కామెంట్స్ వైరల్..!

నాచురల్ స్టార్ గా పేరు పొందిన నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తను నటన మరియు అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు నాని. అదేవిధంగా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్థిరపడవచ్చు అని నిరూపించాడు.

ఇక ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న మూవీ.. సరిపోదా శనివారం. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాని మాట్లాడుతూ..” నేను ఫస్ట్ క్లాస్ చదువుకునేటప్పుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం.

నేను అప్పుడు అనుకున్న అది అమ్మ అయితే నేను నాన్న లాగా ఉండాలని అనుకున్న. కానీ అలా అనుకున్నట్టు ఇయర్స్ తర్వాత మేమిద్దరం స్కూల్ చేంజ్ అయిపోయాము. అప్పటినుంచి తనెవరో నాకు తెలీదు నేనెవరో తనకి కూడా తెలియదు. తన పేరు సోనీ అని తెలుసు ” అంటూ కామెంట్స్ చేశాడు నాని. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.