ఎన్టీఆర్ ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా.. ఎప్పుడు అదే పాట వింటూ ఉంటాడా.. ?!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దివంగ‌త‌ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచేసింది.

Asha Pasham Song || Care Of Kancharapalem Songs - YouTube

ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కొన్ని నెలలుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తారక్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతుంది. తారక్‌ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాట‌పడుతుంటారు. ఎన్టీఆర్ చిన్నప్పటి విషయాలు, ఫొటోస్, ఫ్యామిలీ పిక్స్ నిత్యం షేర్ చేస్తూ వైరల్ చేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా తార‌క్‌ ఫేవరెట్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Watch: Jr NTR's heartfelt speech grabs attention as he accepts Best Actor  Award for RRR at SIIMA 2023 | Telugu Movie News - Times of India

గతంలో త్రిబుల్ ఆర్ మూవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న టైంలో మీకు ఇష్టమైన సాంగ్ గురించి చెప్పమంటే షూటింగ్ నుంచి కాస్త సమయం దొరికిన ఎప్పుడు అదే పాటను వింటూ ఉంటాను అంటూ వివరించాడు ఎన్‌టీఆర్‌. ఇప్పటివరకు తన ఫోన్లో ఎక్కువగా ప్లే చేసిన సాంగ్ కూడా అదే అంటూ చెప్పిన ఆయన.. ఈ పాట ఎంతో సునాయసంగా పాడుతూ ఉంటాడట. ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే. ఆశా పాసం బందీ సేసేలే.. సాగే కాలం ఆడే ఆటేలే.. సాంగ్ 2018 లో రిలీజ్ అయిన C\O కంచరపాలెం సినిమాలోని ఈ పాట తారక్‌కు ఎంతో ఇష్టమైన పాట అని తెలుస్తుంది. ఈ పాటను అనురాగ్ కులక‌ర్ణి అద్భుతంగా ఆలపించాడు. విశ్వ సాహిత్యం అందించాడు. అగస్తి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్య‌వహ‌రించాడు.