ఆ యాక్సిడెంట్ తో నా లైఫ్ తలకిందులైంది.. మ‌హేష్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రీతి జింటాకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సౌత్‌ సినిమాలోను నటించి మెప్పించింది. వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ రాజకుమారుడు సినిమాలో నటించి భారీ పాపులాటి ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడే వరుస ఆఫర్లను అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక కొంతకాలం స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈమె సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది.

Mahesh Babu and Preity Zinta celebrate 21 years of Raja Kumarudu :  Bollywood News - Bollywood Hungama

49 ఏళ్ల వయసులోనూ యంగ్ బ్యూటీగా మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తన నటన, అభినయంతో పాటు హ్యాపీ ఫేస్ తో అందరిని ఆకట్టుకుంది. అయితే ఆ హ్యాపీ ఫేస్ వెనుక‌ గుండె పగిలిపోయే బాధ కూడా ఉందని చాలామందికి తెలియదు. ఆమె 13 ఏళ్ల వయసులోనే కారు ప్రమాదంలో తండ్రిని కోల్పోయి ఎన్నో కష్టాలను అనుభవించింది. తల్లి కూడా అదే ఆక్సిడెంట్ లో తీవ్ర గాయాలు పాలవడంతో రెండు వేలు మంచంలో ఉందట. ఇక ప్రీతి 15 ఏళ్ల వయసులో తల్లి కూడా మరణించడంతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఈమె జీవితం ఆ టైంలో ఎంతో భయంకరంగా గడిచిందని ఓ ఇంటర్వ్యూలో వివరించింది.

ఇక ఆ బాధ నుంచి బయటకు వచ్చి సినిమాల్లో రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యానని వివ‌రించింది. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండగా 1997లో తారా రంపం సినిమాకు ఛాన్స్ వచ్చిందట‌. అయితే ఆ సినిమా కొన్ని కారణాలతో పట్టాలెక్కలేదు. మణిరత్నం డైరెక్ట్ చేసిన దిల్‌సే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. ఇక ప్రీతి పర్సనల్ లైఫ్లో 2016లో గుడ్ నైఫ్‌ను వివాహం చేసుకుంది. అంతకుముందు వరకు బిజినెస్ మాన్ నెస్ వాడియాతో డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ 2008లోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. అప్పుడప్పుడు క్యామియా రోల్స్ లో కనిపించింది.