కల్కి 2898 ఏడి మూవీ పై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..

పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల స‌లార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వాటిలో కల్కి 2898 ఏడి ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ జానెర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన గ్లింప్స్, వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Malayalee Beauty Anna Ben excited about Prabhas Kalki 2898 AD - Telugu News  - IndiaGlitz.com

తాజాగా ఈ సినిమా సాంగ్ షూట్ కు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాల్లో ప్రభాస్, దిశ ప‌ఠ‌న్ని కలిసి రొమాన్స్ చేయబోతున్నారట. వీరిద్దరి రొమాంటిక్ సాంగ్ త్వరలోనే యూరప్ లో షూట్ చేయబోతున్నారని టాక్. దీనికి సంబంధించిన పనులన్నీ సరవేగంగా జరుగుతున్నాయట. కల్కి 2898ఏడి టీజర్ ఇప్పటికే మిలియన్ సంఖ్యలో వ్యూస్ సంపాదించి ట్రెండ్స్ సృష్టించింది. ఈ సినిమా 2024 మే 9లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయశాంతి మూవీస్ బ్యానర్ పై వచ్చి ట్రెండ్ సెట్టర్గా నిలిచిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి విడుదలైన రోజే ఈ సినిమా కూడా వస్తుంది.

Bahubali Prabhas will be seen with Disha Patani, Amitabh Bachchan will  also... - Youthistaan

దీంతో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఇక వాటికిలానే ఇండస్ట్రియల్ హిట్గా కల్కి 2898 ఏడి భారీ సక్సెస్ అందుకుంటుందని అభిమానులంతా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభాస్ ఇటీవల నటించిన అన్ని సినిమాల్లో యాక్షన్ డ్రాప్ తో తెరకెక్కడంతో.. సరైన రొమాంటిక్ సాంగ్ ఏ పడలేదు. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సాంగ్ ఉంది అని వార్తలు వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.