ఎన్టీఆర్ కు ఆ రోల్ లో నటించడం అంటే భయమా.. తారక్ డ్రీమ్ రోల్ అదేనా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భారీ పాపులాంటి దక్కించుకున్న తారక్.. కొరటాల శివ కాంబోలు దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఎటువంటి పాత్రనైనా అలవోకగా నటించి జీవించే ఎన్టీఆర్‌కు ఓ డ్రీమ్ రోల్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పటివరకు ఆ రోల్లో నటించే అవకాశం కూడా ఎన్టీఆర్‌కు రాలేదట.

Jr NTR Reveals 'Devara' Poster, Glimpse on Jan 8 - The Statesman

ఒకవేళ అవకాశం వచ్చిన చేయ‌డానికి కాస్త భ‌య‌ప‌డ‌తాడ‌ట‌. ఇంతకీ ఆ రోల్ ఏంటి.. ఆ రోల్‌లో నటించడానికి అంత భయపడడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాముడు, కృష్ణుడు అనగానే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్. తాతలానే ఎన్టీఆర్‌కు కూడా కృష్ణుడి పాత్రలో నటించాలని ఎప్పటినుంచో డ్రీమ్ ఉండేదట. అయితే ఇప్పటి వరకు కృష్ణుడి పాత్రలో నటించే అవకాశం ఆయనకు రాలేదట‌.

Producers of NTR's Mayabazar had nearly rejected his Krishna role -  Hindustan Times

ఒకవేళ వచ్చినా ఆ పాత్ర చేయ‌టానికి కాస్త భ‌య‌ప‌డ‌తాడ‌ట తార‌క్‌. దానికి కార‌ణం కృష్ణుడి పాత్రలో నా నటనలో ఏ కాస్త లోపం ఉన్న తాత పేరును చెడగొట్టిన వాడిగా మిగిలిపోతాను.. నా నటనకు 100% ఇవ్వాలి అందుకే కాస్త వెనకడుగు కూడా వేస్తానని వివరించాడు ఇక ఒకవేళ ఆ అవకాశం వస్తే ప్రాక్టీస్కు కాస్త టైం తీసుకుని అయినా పర్ఫెక్ట్ గా చేయాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్.