‘ ముసునూరి రాము ‘ లాంటి మాస్ లీడ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక్క‌డుంటే చాలు… సైకిల్‌కు బ్రేకులుండ‌వ్‌..!

పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కాల‌ర్ ఎగ‌రేయ‌డం కాదు.. పోటీ చేసి గెలిచాం అని గొప్ప‌లు పోవ‌డం కాదు.. పార్టీ అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు కూడా వెన్ను చూప‌కుండా ఎదురొడ్డి పోరాటం చేసి గెలిచి నిలిచేవాడే అస‌లు సిస‌లు లీడ‌ర్‌. పార్టీకి నియోజ‌క‌వ‌ర్గంలో అలాంటోడు ఒక్క‌డుంటే చాలు.. అలాంటోళ్ల తెగువ‌, ఆ గ‌ట్స్ ఇత‌ర లీడ‌ర్ల‌లో స్ఫూర్తి నింపుతుంటాయి. చింత‌లపూడి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ లీడ‌ర్, లింగ‌పాలెం మండ‌ల మాజీ పార్టీ ప్రెసిడెంట్‌, రంగాపురం స‌ర్పంచ్ ముసునూరు రాము ఈ కోవ‌లోకే వ‌స్తాడు.

2009 ఎన్నిక‌ల్లో పార్టీ రెండోసారి అధికారానికి దూరం అయ్యాక నియోజ‌క‌వ‌ర్గంలో చాలా డీలా ప‌డింది. ఆ త‌ర్వాత లింగ‌పాలెం మండ‌ల తెలుగుదేశం అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మండ‌లంలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేశారు. అంత‌కు ముందే పార్టీ క్లిష్ట‌స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు 2013 స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మండలానికి గుండెకాయ లాంటి రంగాపురం పంచాయ‌తీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌న స‌తీమ‌ణి వెంక‌ట స‌రోజ‌నిని స‌ర్పంచ్‌గా గెలిపించుకుని ఒక్క‌సారిగా హైలెట్ అయ్యారు.

ఆ త‌ర్వాత రంగాపురం సొసైటీ టీడీపీ ప‌రం కావ‌డంలో కీల‌కంగా చ‌క్రం తిప్పారు. ఇదే ఊపు 2014 అసెంబ్లీ, పార్ల‌మెంటు, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లోనూ లింగ‌పాలెం మండ‌ల వ్యాప్తంగా కంటిన్యూ అయ్యింది. పార్టీ అధికారంలో ఉన్న టైంలో నాలుగు రోడ్ల కూడ‌లి కేంద్రంగా ఉన్న రంగాపురం పంచాయ‌తీ అభివృద్ధిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 2014-19 మ‌ధ్య ఐదేళ్ల కాలంలోనే రంగాపురం పంచాయ‌తీలో 100 % సీసీ రోడ్లు పూర్తి చేశారు.

ప్ర‌తిప‌క్షంలోనూ తిరుగులేని విజ‌యం :
2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయాక 2020లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసేందుకే ఎవ్వ‌రూ ముందుకు రాని ప‌రిస్థితి. అలాంటి టైంలో మ‌రోసారి రంగాపురం స‌ర్పంచ్‌గా తానే రంగంలోకి దిగి విజ‌యం సాధించారు. నిజంగా ఈ గెలుపు రాము గట్స్, డేరింగ్ రేంజ్ ఎలాంటిదో చెప్ప‌క‌నే చెప్పింది. రాముకు బ‌లం లేదు… ప‌ట్టులేదు అని విమ‌ర్శించే వాళ్ల‌కు తాను స‌ర్పంచ్‌గా గెలవ‌డం చెంప‌పెట్టు లాంటిది. ఇక రాము ఎదుగుద‌ల క్రేజ్ చూసి ఎప్పుడూ ఏడ్చేవాళ్లు ఏడుస్తూనే ఉంటారు. తన పార్టీ అధికారంలో లేక‌పోయినా రాము పంచాయ‌తిలో సొంత రోడ్ల‌తో గ్రావెల్ రోడ్లు, ఇత‌ర ప‌నులు చేప‌డుతున్నారు. ఈ స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో రంగాపురంతో పాటు చుట్టుప‌క్క‌ల నాలుగైదు పంచాయ‌తీల్లో పార్టీ గెలుపులోనూ రాము త‌న వంతు పాత్ర పోషించారు. ఎప్పుడైనా పోటీలో ఉండి గెల‌వ‌డంలోనే మ‌జా ఉంటుందే కాని.. ఇత‌ర పార్టీల‌తో రాజీప‌డి ఏక‌గ్రీవాలు చేసుకోవ‌డం.. నీకు ఈ సీటు.. నాకు ఆ సీటు అని రాజీప‌డే మ‌న‌స్త‌త్వం అస్స‌లు రాముది కాదు. ఇలాంటోడు మండ‌లానికి ఒక్క లీడ‌ర్ ఉంటే టీడీపీకి తిరుగే ఉండ‌ద‌ని చెప్పాలి.

 

త‌న‌, మ‌న ప‌ర తేడా లేని వ్య‌క్తిత్వం :
లింగ‌పాలెం మండ‌లంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ సోద‌రుల్లో తిరుగులేని ప‌ట్టు రాము సొంతం. ఎవ‌రికి ఏ ఆప‌ద వ‌చ్చినా త‌న‌, మ‌న‌, ప‌ర అన్న తేడా లేకుండా అక్క‌డ వాలిపోయి సాయం చేయ‌డం ఆయ‌న నైజం. సొంతంగా డెయిరీ నిర్వ‌హిస్తూ ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 150 మందికి ఉపాధి క‌ల్పిస్తున్నారు. రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన రాము రైతుల‌కు ఏ ఇబ్బంది వ‌చ్చినా అస్స‌లు త‌ట్టుకోలేరు. వెంట‌నే సాయం చేస్తారు. ప్ర‌మాదాలు, అనారోగ్యంతో హాస్ప‌టల్లో ఉన్న వారి విష‌యంలో రాము తీసుకునే కేర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తాను ఎంత బిజీగా ఉన్నా బాధితుల‌కు తోడుగా త‌న మ‌నిషిని పెట్టి హాస్ప‌ట‌ల్‌కు పంపి.. ఫాలోఅప్ చేయ‌డంతో పాటు త‌ర్వాత తాను కూడా వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి నేనున్నాన‌ని మ‌నోధైర్యం నింపుతారు. రాము అన్న ఒక్క పేరు బాధిత కుటుంబాల‌కు కొండంత భ‌రోసాగా ఉంటుంది. మ‌రో రెండు నెల‌ల్లో సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత లింగ‌పాలెం మండ‌ల రాజ‌కీయాల్లో రాము పాత్ర మ‌రింత కీల‌కం కానుంది.