వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బాస్ ‘ అమర్ దీప్’ .. హీరోయిన్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..

సీరియల్ నటుడు అమర్‌దీప్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై హీరోగా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న అమర్‌దీప్.. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమర్ దీప్.. చివరి వరకు హౌస్ లో కొనసాగాడు. ఇక టైటిల్ పోరులో నిలిచిన అమర్ ఈ ఆట ద్వారా తన సత్తా ఏంటో నిరూపించాడు.

ఇక హౌస్ లో ఉండగా మాటిమాటికి ప్రశాంత్‌తో గొడవ పడుతూ అతని ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాడు. దీంతో ఎన్నో ట్రోల్స్‌ను ఎదుర్కొన్న అమర్‌దీప్.. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా పరిణామాలను చెవిచూశాడు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటివరకు బుల్లితెరపై హీరోగా రాణించిన ఈయన.. వెండితెరపై హీరోగా నటించే అవకాశాన్ని అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత నటించబోతోంది.

ఈ సినిమా ఓపెనింగ్ తో పాటు ప్రొడక్షన్ నెంబర్ 2.. పూజా కార్యక్రమం ఈరోజు హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్స్ లో గ్రాండ్గా జరగనుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎం 3 మీడియా బ్యాన‌ర్‌లో మహేంద్ర నాథ్ కొండ్ల‌ నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఇందులో సీనియర్ హీరో వినోద్ కుమార్, రాజా రవీంద్ర లాంటి నటులు కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే అమర్ దీప్ సరసన సుప్రీత నటించబోతుందంటూ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో అంతా షాక్ అవుతున్నారు