నాకు కాబోయే వాడిలో ఈక్వాలిటీస్ ఉంటే సరిపోతుంది.. ‘ యానిమల్ ‘ బ్యూటీ త్రిప్తి కామెంట్స్..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెర‌కెక్కిన యానిమల్ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ వద్ద దాదా రూ.900 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ క‌పూర్‌, నేషనల్ క్రష్‌ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు.

అయితే ఈ సినిమాలో కనిపించింది కాసేపే ఐనా.. భారీ పాపులారిటీ దక్కించుకున్న బోల్డ్ బ్యూటీ తృప్తి దిమ్రి ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. రష్మిక కంటే ఈ సినిమాతో ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది తృప్తి. దీంతో ఒక్కసారిగా తృప్తిది ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో ఎన్నో ఆఫర్లు క్యూ కట్టాయి. అటు టాలీవుడ్ లోనూ.. ఇటు బాలీవుడ్ లోనూ.. అవకాశాలు అందుకుంటున్న తృప్తి.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది.

ఈ నేపథ్యంలో ఆమెకు పెళ్లిపై ప్రశ్నలు ఎదురు కాగా ఇప్పటికైతే.. పెళ్లిపై ఎలాంటి ఆలోచన లేదని.. ప్రస్తుతం నేను కెరీర్‌పై దృష్టి పెడుతున్న అంటూ వివరించింది. అయితే కాబోయే భర్త ఎలా ఉండాలంటూ ఎదురైనా ప్రశ్నలకు మంచి వ్యక్తి అయితే సరిపోతుంది.. అదొక్కటే కోరుకుంటున్నా అంటూ వివరించింది. మంచిగా ఉంటే డబ్బు, పేరు వాటంతట అవే వస్తాయి అంటూ చెప్పుకొచ్చింది. ఈమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట‌ వైరల్‌గా మారాయి.