హనుమాన్ నుంచి ఇప్పటివరకు అయోధ్యకు ఎంత విరాళం అందిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తేజసజ్జ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. మొట్టమొదటిసారి టాలీవుడ్‌లో సూపర్ మాన్ స్టోరీ గా తెర‌కెక్కిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ హిట్గా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు మార్క్‌ దాటి రూ.200 కోట్ల బరిలోకి దూసుకుపోతున్న ఈ సినిమా.. వీక్ండ్‌ డేస్ లో మరిన్ని భారీ వసూళ్లను రాబట్టింది. హనుమాన్ రెండవ వారంతరం అన్నిచోట్ల మాక్సిమం ఆక్యూపెన్సీని చూపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు ప్రజల ప్రశంసాలను కూడా అందుకుంటుంది.

Political Views on X: "HanuMan movie director Prashant Verma revealed that  the team of 'HanuMan' has already donated Rs 14 lakh from the first day's  collection to Ayodhya Ram Mandir. The producers

అయోధ్యలో రామ మందిరానికి ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి టికెట్టుకు రూ.5 చొప్పున విరాళం ఇస్తామని మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నారు. వారు చెప్పిన విధంగానే అయోధ్య మందిరానికి వారి ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2, 97, 162 టికెట్ల నుంచి రూ.14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు.

HanuMan' team donates Rs 2.66 Cr for Ayodhya Ram Mandir

అయోధ్య రామ మందిరం కోసం ఇప్పటికీ హనుమాన్ మూవీ నుంచి 58, 28, 211 టికెట్ల నుంచి రూ. 2,66,41,055 విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిజంగానే హనుమాన్ మేకర్స్ గ్రేట్ అంటూ స్వార్ధంగా ఆలోచించకుండా వారి ఆదాయం నుంచి అయోధ్య రామ మందిరానికి డబ్బు ఇస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెట్టిజ‌న్లు.