నేను ఆ సీన్లలో నటించినప్పుడల్లా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటారు.. స్టార్ బ్యూటీ కామెంట్స్ వైర‌ల్‌..

‘ ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ వెండితెరపై కనిపించపోతున్నాడు. ఈ సినిమాలో స్టార్ యాక్ట్రెస్ వర్షా బొల్లమ్మ హీరోయిన్గా నటించబోతుంది. విఐ ఆనంద్ దర్శకత్వంలో సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో మూవీ టీం పాల్గొంటున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్షా బొల్లమ్మ సంద‌డి చేశారు.

ఎన్నో ఆశ‌క్తి క‌ర విష‌యాల‌ను షేర్ చేసుకున్న ఈమె తన పెళ్లి ప్లాన్ గురించి చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. కెరీర్ పరంగా ప్రస్తుతం తాను సంతృప్తిగా ఉన్నానని.. మాది సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాకపోయినా తల్లిదండ్రులు ఎంతగానో సపోర్ట్ చేశారంటూ.. వాళ్ల వల్లే నేను ఈ స్థాయికి రాగలిగానంటూ వివరించింది వర్షా. ఇప్ప‌టికే తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు సినిమాలో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈమె మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు నన్ను వారి సొంత మనిషి లాగా అభిమానిస్తున్నారంటూ వివ‌రించింది.

మిడిల్ క్లాస్ మెలోడీస్ రిలీజ్ అయిన తర్వాత తెలుగు వాళ్ల నుంచి కూడా నాకు ప్రశంసలు వచ్చాయి.
నా ప్రతి షూట్ అమ్మ తోడుగా ఉంటుంది. ఒకవేళ నేను ఏదైనా పెళ్లి సన్నివేశంలో నటిస్తే అది చూసి ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి పెళ్లి ప్లాన్స్ అయితే ఏమీ లేవు అంటూ వివరించిన ఆమె మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ వివ‌రించింది. ఆమె కాబోయే వాడు తన‌ తమా అనే బేధాలు చూపించకుండా మంచి మనసున్న వ్యక్తి అయితే సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది.

కర్ణాటకలోని కూర్గ్ గ్రామానికి చెందిన వర్షా డబ్‌స్మాష్‌ వీడియోతో స్టార్ సెలబ్రిటి స్టేట‌స్ సొంతం చేసుకుంది. కోలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈమె 96, బిగిల్ సినిమాలతో భారీ పాపులాటి దక్కించుకుంది. చూసి చూడంగానే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన వర్ష.. మిడిల్ క్లాస్ మెలోడీస్ తో పాపుల‌ర్ అయ్యింది. స్వాతిముత్యం తర్వాత ఆమె నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఇక ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.