‘ హనుమాన్ ‘ మూవీ థియేటర్ల సమస్యపై మెగాస్టార్ రియాక్షన్ ఇదే..

తేజ సిజ్జా హీరోగా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హనుమాన్. సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. మహేష్ గుంటూరు కారం సినిమాకు పోటీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి థియేటర్ల సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. ధియేటర్లు దొరకకపోవడంతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ నేపథ్యంలో సినిమాని వాయిదా వేసుకునే పరిస్థితి కూడా లేదు. చాలా స్ట్రగుల్స్ మధ్య హనుమాన్ సినిమాను మహేష్ సినిమాతో పోటీగా రిలీజ్ చేస్తున్నారు. మేకర్స్ మ‌ధ్య ఇప్పటికీ ఇది థియేటర్లకు సంబంధించిన వివాదం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి దీనిపై స్పందించారు.

Hanuman Pre-release event, Chiranjeevi: God gave the film's title through  me - TeluguBulletin.com

హనుమాన్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కు అతిధిగా వచ్చిన మెగాస్టార్.. తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. అదేవిధంగా హనుమాన్ సినిమా ధియేటర్ల సమస్య గురించి మాట్లాడుతూ కంటెంట్ బాగుంటే సినిమాను ఎవరు ఆపలేరని.. పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కంటెంట్ ఉన్న సినిమా మొదటి రోజు, మొదటి షో, మొదటి ఆట సరిగ్గా లేకపోయినా తర్వాత నుంచైనా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు.. అయితే ఇది మూవీకి కచ్చితంగా పరీక్ష కాలమనే చెప్పాలి అంటూ జాగ్రత్తగా కామెంట్స్ చేశాడు. సినిమాలో కంటెంట్, స‌త్త‌ ఉండి దైవం ఆశీస్సులు ఉంటే ఆడియన్స్ కచ్చితంగా సినిమాను ఆదరిస్తారు.. హక్కున చేర్చుకుంటారు అంటూ వివరించాడు. సంక్రాంతి పండుగ సినిమాలన్నింటికీ చాలా ముఖ్యమైనది. అదే టైంలో ఎక్కువ సినిమాలు ఆడేందుకు అవకాశం కూడా ఉంది అంటూ వివరించాడు.

Chiranjeevi Superb Speech @ HanuMan Pre Release Event

ఈ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదని కంటెంట్ ఉందా కచ్చితంగా మార్కులు పడతాయంటూ వివరించారు. చిన్నవాడైన తేజ సంక్రాంతికి వచ్చే వెంకటేష్, నాగార్జున, మహేష్ సినిమాలు కచ్చితంగా ఆడాలని వాటితో పాటే తమ సినిమా కూడా ఆడాలని చెప్పుకొచ్చాడు.. చిన్నవాడైన పెద్ద మనసుతో మాట్లాడడం ఆనందంగా ఉంది. అన్నీ సినిమాలు ఆడాలి పరిశ్రమ పచ్చగా ఉండాలి వాటితో పాటు హనుమాన్ కూడా ఉండాలి అని చెప్పడం చాలా సంతోషంగా ఉందంటూ వివరించాడు. ఇలాంటి పరిస్థితి 2017 లో వచ్చిందని అప్పుడే నాకు ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ అయింది.. ఆ సమయంలో బాలకృష్ణ నుంచి గౌతమీ పుత్ర శాతకర్ణి, దిల్ రాజు శతమానంభవతి సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Megastar Chiranjeevi Superb Speech @ Hanuman Pre Release Event | Teja Sajja  | Manastars - YouTube

ఈ రెండు సినిమాలు వేయడం ఏంటని దిల్ రాజును అడిగాను.. పర్వాలేదు ఒకసారి సంక్రాంతికి ఆ స్పేస్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అలానే ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలు కూడా పెద్ద హిట్ అయ్యాయి అంటూ వివరించాడు. దిల్‌రాజు సినిమాల విడుదల విషయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి.. ఏ సినిమాకి ఎంత వస్తుంది.. ఎలా ఆడుతుంది.. ఆయనకు బాగా తెలుసు. కచ్చితంగా ఈ మూవీ కూడా అలాంటి ఆదరణ పొందుతుంది.. ఆ విషయంలో టెన్షన్ పడనవసరం లేదు అందరూ ధైర్యంగా ఉండండి అంటూ వివరించాడు. ఆమ‌జ‌నేయుని ఆశీస్సులు హనుమాన్ సినిమాకు ఉంటాయని చెప్పుకొచ్చిన చిరంజీవి సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులందరికీ అభినందించాడు.