ఆర్ఆర్ఆర్, సలార్ ఆడియో రికార్డులను బ్రేక్ చేసిన ‘ దేవర ‘.. ఎన్టీఆర్ మానియా షురూ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక ఈరోజు ఈ సినిమా గ్రీంప్స్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఆచార్య లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత‌ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించడంతో కొరటాలు కచ్చితంగా ఈ సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలని చాలా కసితో ఉన్న‌ట్లు తెలుస్తుంది. అలాగే ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్‌ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన కూడా ఈ సినిమాకు చాలా కష్టపడుతున్నారట. భారీ స్కేల్, స్ట్రాంగ్ కంటెంట్ తో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

Sivam C Kabilan on X: "#Devara ✨ @tarak9999 #KoratalaSiva @anirudhofficial  @NTRArtsOfficial #HappyNewYear2024 https://t.co/DqvhDD3jb7" / X

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాపై మంచి హైప్‌ తెచ్చిపెట్టాయి. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న దేవర కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు గ్లింప్స్‌ రిలీజ్ ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా థియేటర్ రైట్స్ సంబంధించిన చర్చలు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నాయి. ఓవర్సీస్ లో టీం భారీగా డిమాండ్ చేస్తున్నారని.. సుమారు రూ.30 కోట్ల వరకు నిర్మాతలు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. కంటెంట్ పై నమ్మకంతో ఈ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారట.

Devara Cast Salary: NTR Pockets His Biggest Paycheque Ever

మరోవైపు డిజిటల్ రైట్స్ కూడా గట్టిగానే అందుకునే ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే తాజాగా ఆడియో రైట్స్ విషయంలో దేవర రికార్డులను క్రియేట్ చేసింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాలను దాటేసి భారీ దరికి అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. సుమారు రూ.28 కోట్లకు ఈ ఆడియో రైట్స్ను అమ్మారట మేకర్స్. ఆర్‌ఆర్ఆర్‌ను రూ.25 కోట్లకు, స‌లార్ రూ.12 కోట్లకు, యానిమల్ రూ.16 కోట్లకు అమ్ముడు పోగా.. తాజాగా వచ్చిన ఎన్టీఆర్ మూవీ మూడు సినిమాల రికార్డులను దాటేసి భారీ ధరకు ఆడియో రైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది. సినిమాకు ఎన్టీఆర్ సర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా, బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.