” నా వెనుక ఆయన ఉన్నారు.. అందుకే నేను ఇంతవరకు వచ్చాను “.. తేజ సెన్సేషనల్ కామెంట్స్..!

యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ గాడ్ సెంటిమెంట్ మూవీ ” హనుమాన్ “. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఇదే తేదీన గుంటూరు కారం సైతం ఈ సినిమాతో పోటీ పడనుంది. అయినప్పటికీ హనుమాన్ మూవీ మేకర్స్ ఏ మాత్రం టెన్షన్ పడకుండా తమ సినిమాపై నమ్మకంతో ఆ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రీ రిలీజ్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఇక ఈ వేడుకకు చీప్ గెస్ట్ గా చిరంజీవి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే తేజ మాట్లాడుతూ..” నా వెనుక అంజనీపుత్రుడు ఉన్నాడు. నా ఎదురుగా కూడా అంజనీపుత్రుడు ఉన్నారు. అందువల్ల మాట్లాడడానికి నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. చిరంజీవి గారు సినిమాలలో మాత్రమే ఆపద్బాంధవుడు కాదు.. సినిమా వాళ్లకి కూడా ఆపద్బాంధవుడే.

ఎవరైనా గెలిస్తే ముందుగా ఫోన్ చేసి ప్రశంసిచ్చేది చిరంజీవి గారే. ఎవరైనా ఓడిపోతే వెనుకున్న అనే అండనిచ్చేది కూడా చిరంజీవి గారే. నా జీవితంలో మా అమ్మ నాన్న తరువాత నేను రుణపడి ఉండేది చిరంజీవి గారికి. ఆయనను ఆదర్శంగా తీసుకునే ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిని. నా ఉనికికి.. ఉన్నతకి కారణమైన చిరంజీవి గారికి పాదాభివందనాలు ” అంటూ చెప్పుకొచ్చాడు తేజ. ఇక ప్రస్తుతం తేజ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈయన వ్యాఖ్యలకి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు.