మారుతి సినిమాలో ప్రభాస్ న్యూ లుక్… ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్న ఫ్యాన్స్..!

కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ పై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సెకండ్ పార్ట్ లో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ అండ్ మోడ్రన్ లుక్ లో కనిపించనున్నాడని.. ప్రభాస్ హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ఓన్లీ వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలోని విజువల్స్ వండర్ ఫుల్ గా ఉండనున్నాయట.

ఇక ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకోనున్నట్లు సమాచారం. అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కనుక హిట్ అయితే మారుతి రేంజ్ భారీగా పెరిగిపోతుందని చెప్పాలి. ఇక అన్నట్లు ఈ సినిమాను దాదాపు రూ. 3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించునున్నారట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.