” నేను హనుమాన్ మూవీ కి సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే “… గుట్టు బయటపెట్టిన చిరంజీవి..!

దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ హీరోగా లేటెస్ట్ గా తెరకెక్కనున్న మూవీ ” హనుమాన్ “. ఈ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ భారీ స్థాయిలో అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీన మహేష్ గుంటూరు కారం సినిమాతో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్నారు చిత్ర బృందం.

ఈ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ..” నా ఇష్ట దైవం హనుమంతుడికి సంబంధించిన కంటెంట్ తో ఈ సినిమా రూపొందడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. తేజ సజ్జా నా ముందు డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్ పైన హీరోగా మాట్లాడే స్థాయికి అంచలంచలుగా ఎదుగుతూ వచ్చాడు.

అతని కోసమే నేను ఇక్కడికి వచ్చేననేది రెండో కారణం. ఇక ట్రైలర్ తోనే నన్ను మెప్పించిన ప్రశాంత్ వర్మ మూడో కారణమని చెబుతాను. హనుమ ఆశీస్సుల కారణంగానే నాకు ఒక లక్ష్య సాధన.. నిబంధన అలవడ్డాయని నేను భావిస్తూ ఉంటాను. అలాంటి హనుమాతో నాకు ఒక అనుబంధం ఉంది. ఆయనను నమ్ముకోవడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను ” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.