మెగాస్టార్ ‘ హనుమంతుడికి ‘ భక్తుడు కావడానికి వెనక అంత పెద్ద కథ ఉందా..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. హనుమంతుడికి పెద్ద భక్తుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రత్యక్షంగా, నా పరోక్షంగా ఈ విషయాన్ని ఎప్పుడూ వివరిస్తూనే ఉంటారు. నేను ఈ స్టేజ్ కు రావడానికి కారణం కూడా ఆంజనేయ స్వామి అని చెబుతూ ఉంటాడు. ఇక ఇంట్లో కూడా ఆంజనేయ స్వామికి గుడి కట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన చిరంజీవి తను ఎందుకు హనుమంతుడికి అంత పెద్ద భక్తుడయ్యాడు.. దాని వెనుక ఉన్న కథ ఏంటో చెప్పుకొచ్చాడు. తను ఈ స్టేజ్ కి రావడానికి తనలో ఈ క్రమశిక్షణ, కష్టపడే తత్వానికి కూడా హనుమంతుడి కారణమంటూ చెప్పుకొచ్చాడు.

Chiranjeevi Army on X: "Happy Hanuman Jayanti 💐 May Lord Hanuman bless  your life. #LordHanuman 🙏🙏🙏 @KChiruTweets #Chiranjeevi  #MegastarChiranjeevi #HanumanJayanti #HanumanChalisa #JaiShreeRam  #JaiHanman #HanumanJi #HanumanJayanti2022 https://t.co ...

ఒక మాటలో చెప్పాలంటే హనుమంతుడు తన కుల దైవంగా మారాడని.. హిందుత్వం గురించి, మతం గురించి ఇక్కడ మ్యాటర్ కాదు ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా హనుమంతుడు నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ అంటే చెప్పుకొచ్చాడు. మనం పైకి రావడానికి ఆయ‌న‌కు సరెండర్ అయిపోతే మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనే దానికి నేనే ఉదాహరణ అని.. ఆయనని ఆదర్శంగా తీసుకోవడం వల్ల ఈ స్థానంలో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. చిరు తను ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాన‌ని అన్నాడు. చిన్నప్పుడు వారింట్లో ఎవరు దైవభక్తులు లేరని.. నాన్న కమ్యూనిస్టు అసలు దేవుడిని నమ్మేవాడు కాదు అంటూ వివరించాడు.

అమ్మ ఒత్తిడితో ఎప్పుడైనా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్లమని తెలిపిన చిరు.. పొన్నూరులో నేను ఏడో తరగతి చదువుకునే టైంలో అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉండేదని రోజు దండం పెట్టుకుని వచ్చేవాడినని.. ఇక 8 క్లాస్ బాపట్ల కు షిఫ్ట్ అయ్యామని.. అక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడి ఉంది.. ప్రతిరోజు సాయంత్రం ట్యూషన్ కి వెళ్లి వచ్చేటప్పుడు ఆ గుడి వద్ద ఇచ్చే ప్రసాదం కోసమే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లేవాడిని అలా ప్రసాదం తింటూ పూజారి చెప్పే విషయాలువింటూ హనుమాన్ చాలీసా చదివేవాడిన‌ని.. అలా హనుమంతుడికి భక్తుడిని అయ్యా అంటూ చెప్పుకొచ్చాడు.

Chiranjeevi shares heartfelt greetings on Hanuman Jayanthi ...

ఇక మొగల్తూరులో చదువుకునే టైంలో అక్కడ రోడ్డుపై మిఠాయి తీసుకుంటే హనుమంతుడి క్యాలెండర్ వచ్చిందని.. ఉదరం చీల్చుకుని సీతారాముని చూపిస్తున్న ఫోటో అని.. దానిని ఇప్పటికీ మా ఇంట్లో ఉంచుకున్న ఎన్నో ఏళ్ల నుంచి పూజిస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటినుంచి నేను ఆయన వెంట పడ్డానా.. ఆయన నా వెంట పడ్డాడో తెలియదు కానీ ఇప్పటికీ హనుమంతుడు నాలో అంతర్భాగం అయిపోయాడు అంటూ వివరించాడు. ఆ తర్వాత చిరు టెన్త్‌ చదివే టైంలో పేరాల చీరాలలో చిరంజీవి తండ్రి పనిచేసేవాడట.

ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యి అది బాగా దూరం కావడంతో అక్కడికి వెళ్లడం ఇష్టం లేక లాంగ్ లీవ్ పెట్టిన చిరూ తండ్రి ఒత్తిడికి గురవుతుంటే హనుమాన్ చాలీసా చదువమ‌ని చెప్పా ముందు సంకోచించిన ఆ తర్వాత అవుతుంది అంటావా అని చదవడం మొదలు పెట్టాడని.. ఆ వెంటనే తన ఉన్న ఊరికే తండ్రి జాబ్ ట్రాన్స్ఫర్ అయింది అంటూ చిరు చెప్పుకొచ్చాడు. ఆ తరువాతే ఆయన తండ్రికి హనుమంతుడి పై నమ్మకం కుదిరిందట. తనకి గురువు ఎవరో కాదు ఆంజ‌నేయుని పరిచయం చేసిన గురువు నువ్వే అంటూ చిరుని తండ్రి అంటుంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా అంటూ వివ‌రించాడు. పేరాలలో డిగ్రీ పూర్తి చేసి ఫిలిం ఇన్స్టిట్యూట్ చెరడానికి చెన్నై వెళ్ళిపోవాలనుకునే సమయంలో పెరట్లో ఆంజనేయ స్వామి బొమ్మ దొరికిందట‌.

rediff.com: Chiranjeevi prays for political fortune?

దాన్ని నాన్న మెడలో లాకెట్ చేసి ఇచ్చాడని.. అది మెడలో వేసుకుని చెన్నై వెళ్లి ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చేరినట్లు వివరించాడు. ఆ తర్వాత తనకు అవకాశాలు రావడం మొద‌ల‌య్యాయ‌ని 1977 – 78 నుంచి ఆఫర్లు వచ్చాయని ఇక తర్వాత ఎక్కడ ఆగలేదని దీని అంతటి కి ఆంజనేయస్వామి మహిమే కారణం అంటూ నేను భావిస్తానని వివరించాడు. ఎప్పుడు నేను అంజిస్వామితో మాట్లాడుతూనే ఉంటానని ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చిన రాత్రి హనుమంతుడితో మనసులోనే మాట్లాడతానని తెల్లవారేసరికి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని.. ఇప్పటివరకు నా లైఫ్ ఇంత సక్సెస్ఫుల్గా వెళ్లడానికి ఆ హనుమంతుడే కారణమని వివరించాడు.