మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ట్రైలర్ వచ్చేసిందోచ్.. మాస్ లుక్ లో ఊచకోత కోశాడుగా (వీడియో)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక శ్రీనిల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక తాజాగా ఈ మూవీ యొక్క ట్రైలర్ నిన్న రాత్రి 9: 09 గంటలకు రిలీజ్ చేశారు మేకర్స్. మహేష్ కు అడ్డ అయిన సుదర్మన్ థియేటర్లో ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో మహేష్ మాస్ యాక్షన్ డైలాగ్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక అసలు సినిమా స్టోరీ ఏంటనే కాన్సెప్ట్ రిలీవ్ చేయకుండా.. జాగ్రత్త తీసుకున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ మాత్రం ఉండబోతున్నట్లు అర్థమైంది. ఈ ట్రైలర్లో ” చూడంగానే మజా వచ్చిందా.. హార్ట్ బీట్ పెరిగిందా.. ఈల వేయాలనిపించిందా..” అంటూ అందరినీ ఆకట్టుకున్నాడు మహేష్. అంతేకాకుండా శ్రీ లీలతో రొమాన్స్ చేస్తూ సినిమాపై మరింత హైప్స్ పెన్ చేశాడు. ఇక ఈ సినిమా ఈనెల 12న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.