వెంకీ ” సైంధవ్ ” మూవీ యూఎస్ లేటెస్ట్ వసూళ్లు ఇవే..!

విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు నవాజూద్దీన్ విలన్ గా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు.

ఇక నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ ఈనెల 13న రిలీజ్ అయింది. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా ఈ మూవీ యూఎస్ లో 200కే డాలర్స్ కి పైగా కలెక్షన్స్ ని రాబడుతున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు.

సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీలో వెంకటేష్ పవర్ ఫుల్ యాక్టింగ్, శైలేష్ టేకింగ్ తో పాటు యాక్షన్, ఎమోషనల్ అంశాలకు అందరి నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త విన్న వెంకీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు కూడా. ఇక రానున్న రోజుల్లో వెంకటేష్ మరిన్ని కలెక్షన్స్ ను రాబట్టి రికార్డ్ స్థాయిలో నిలుస్తాడో లేదో చూడాలి మరి.