” అందువల్లే అటువంటి ఆశలు అన్ని గుంటూరు కారంలో ఉండేలా చూసాం “.. మహేష్ సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.

ఇక అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా ఈ మూవీ యొక్క బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ..” నిజానికి ఇకపై నాకు రీజనల్ సినిమాలు చేసే అవకాశం లేకపోవడంతో ఈ సినిమా ద్వారా నా నుంచి ఫ్యాన్స్, ఆడియన్స్ ఆశించే అన్ని రకాల అంశాలు జోడించాము.

ముఖ్యంగా మాస్ సాంగ్స్, డ్యాన్స్, మాస్ స్టెప్స్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ వంటివి పక్కాగా ఉండేలా చూసుకున్నాము. రాబోయే సినిమాలలో పక్కాగా ఇటువంటి అంశాలు ఉన్న సినిమాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ” అంటూ చెప్పుకొచ్చాడు మహేష్. ఇక ప్రస్తుతం మహేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.