చిరంజీవి ” గాడ్ ఫాదర్ ” మూవీ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్‌ చేసుకున్న ఆ డైరెక్టర్ ఎవరంటే..!

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ ఖండల ధీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ” గాడ్ ఫాదర్ “. మోహన్ రాజు తెరకెక్కించిన ఈ మూవీ మలయాళం సూపర్ హిట్ లూసీఫర్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని సైతం రాబట్టింది. నయనతార మరియు సత్యదేవ్, సునీల్ తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతమందించాడు.

ఇక అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా యువ దర్శకుడు బాబీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ..” లూసిఫర్ మూవీ రైట్స్ నా దగ్గర ఉండడంతో తమకున్న అప్షన్స్ లో ఒక దర్శకుడిగా నన్ను అనుకున్నట్లు ఒకానొక సందర్భంలో చిరంజీవి చెప్పారు. అనంతరం తాను ఆ మూవీని దాదాపుగా 25 సార్లు చూసి దానికి తను న్యాయం చేయలేరని భావించారట బాబీ. నేను తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్ అయింది.

నిజానికి అది వేరొకరి కథ.. అలానే అనంతరం తీసిన జై లవకుశ పెద్ద సక్సెస్ అయ్యింది. ఆపై తీసిన వెంకీ మామ కూడా సక్సెస్ అయినప్పటికీ ఆ స్క్రిప్ట్ కూడా నాది కాకపోవడంతో ఎంత సక్సెస్ అయిన నాకు సంతృప్తిని మాత్రం అందించలేకపోయింది. నిజానికి చిరంజీవి అంతటి వారు అడిగాక నో అని చెప్పలేక పోయినప్పటికీ పూర్తిస్థాయిలో బాగా ఆలోచించుకుని అనంతరం చిరంజీవి గారికి మెల్లగా చెప్పాను. ఇలా నా నుంచి గాడ్ ఫాదర్ మూవీ మిస్ అయింది ” అంటూ చెప్పుకొచ్చాడు బాబీ. ప్రస్తుతం బాబి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.