సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఉన్న కామన్ పాయింట్‌లు ఇవే..

నందమూరి తారకరామారావు ఈ పేరుకు తెలుగు నాట ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ రంగంలో తనకంటూ తిరుగులేని స్టార్ డంను క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. ఆయ‌న‌ మనవడిగా ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే రేంజ్ లో పాపులారిటి తెచ్చుకుంటున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకుంటున్నాడు. అయితే ఈ తాత మనవళ్ళ మధ్యన ఉన్న కామన్ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ యంగ్ గా ఉన్న సమయంలో ఇంటింటికి పాలు పోస్తూ వచ్చిన డబ్బుతో పొట్ట నింపుకునేవారు.

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తరువాత ప్రతి అవకాశాన్ని కష్టపడి సద్వినియోగం చేసుకొని మహానటుడిగా ఎదిగాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా చిన్నతనం నుంచే కష్టపడడం అలవాటు చేసుకున్న వ్యక్తి. ఎన్టీఆర్ మనవడిగా పరిచయమైనా తనకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్‌కు పౌరాణిక పాత్రలు అంటే ఎంతో ఇష్టం. కృష్ణుడు, రాముడులా దేవుళ్ళ పాత్రలే కాదు.. దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి నెగిటివ్ పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. అదేవిధంగా తాతకిలానే మనవడు ఎన్టీఆర్‌కు కూడా పావురానికి పాత్రులు అంటే ప్రాణం అట. ఆ ఇష్టంతోనే యమదొంగ సినిమాలో యముడిగా కాసేపు కనిపించి అదరగొట్టాడు.

మంచి పౌరాణిక కథతో పూర్తి సినిమా చేసి అందరితో శభాష్ అనిపించుకునేందుకు ఎన్టీఆర్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారట. స్టార్ హీరోగా ఓ ఇమేజ్ వస్తే కేవలం కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే ఆ రూల్స్ ని ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ బ్రేక్ చేస్తూ నెంబర్ వన్ హీరోగా ఉన్న మిస్సమ్మ, బడిపంతులు లాంటి క్యారెక్టర్ చేస్తూ స‌క్స‌స్‌ అందుకున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ కూడా నడుచుకుంటున్నాడు. సినిమా, సినిమాకు వైవిధ్యమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ లవర్ బాయ్, మాస్ హీరో, క్లాస్ హీరోగా తన యాక్టింగ్ లో డిఫరెంట్ షేడ్స్‌ చూపిస్తున్నారు.

ఇక సీనియర్ ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 9. ఆయన సీఎం గా అయిన తర్వాత కూడా కారు నెంబర్ను 9999 వచ్చేలా చూసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా అదే లక్కీ నెంబర్. అందుకోసమే తను అత్యధిక రేటు చెల్లించి అయినా తన కారుకు 9999 వచ్చేలా చూసుకున్నారు. దైవంలా భావించే ప్రజలకు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాడు. సీనియర్ ఎన్టీఆర్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను హీరోగా దేవుడిగా అందరినీ తన నాయకత్వంతో మెప్పించాడు. సీనియర్ ఎన్టీఆర్ లోని సేవా తత్వం జూనియర్ ఇంట్లో కూడా అలవడింది. రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్న ఆయన.. ఎప్పటికప్పుడు పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు.

ఇక ఎంతటి పెద్ద డైలాగు అయిన సాంస్క్రిట్ డైలాగ్ అయినా సరే.. పొల్లు పోకుండా స్పష్టంగా చెప్పేసే సత్తా సీనియర్ ఎన్టీఆర్‌లో ఉంది. ఆయన తరువాత అంతే స్పీడ్ గా డైలాగ్ చెప్పడం తారక్‌కు మాత్రమే వీలైంది. దానవీరశూరకర్ణ సినిమాలో తాత చెప్పిన ఆచార్యదేవోభవ అనే డైలాగ్ రామయ్య వస్తావయ్య సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అదే రేంజ్ లో చెప్పి అదరగొట్టారు. ఇక మన భాష, సంస్కృతి అంటే ఈ తాత మనవాళ్ళకి ఎంతో గౌరవం. సినిమాల్లో కంటే బయట ఎన్టీఆర్ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతారు. ఈ జనరేషన్ కి సంబంధించిన వ్యక్తి అయినా జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడుతుంటారు.