ఫైనల్లీ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన కీర్తి సురేష్.. ఈ పండగ మరింత స్పెషల్..!

కీర్తి సురేష్ .. మహానటి .. ఒకప్పటి జనరేషన్ కి మహానటి అంటే సావిత్రి గారు గుర్తొచ్చేవారు. అదే ఇప్పటి జనరేషన్ కి మహానటి అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కీర్తి సురేష్ . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమా ద్వారా స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ తెలుగులో ఎన్నో సినిమాలు నటించింది. తెలుగులో ఆమె ఆఖరిగా నటించిన సినిమా భోలా శంకర్ .

 

ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . పరమ చెత్త రికార్డులు క్రియేట్ చేసుకుంది . సోషల్ మీడియాలో ఈ సినిమా కారణంగా హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంది కీర్తి సురేష్ . ఈ క్రమంలోనే ఆమెను ఐరన్ లెగ్ అంటూ కూడా ట్యాగ్ చేసి ట్రోల్ చేశారు జనాలు. హర్ట్ అయిన కీర్తి సురేష్ ఇక తెలుగులో సినిమాలు చేయకూడదు అంటూ డిసైడ్ అయింది అన్న వార్తల కూడా వినిపించాయి .

అయితే కీర్తి సురేష్ తాజాగా తెలుగులో ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . నాగచైతన్య తండేల్ సినిమాలో కీర్తి సురేష్ సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి . దీంతో తెలుగు అభిమానులకు ఆమె గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. చూద్దాం ఆమెకి ఈ సినిమా ఎలాంటి విజయం అందిస్తుందో..? సక్సెస్ అయితే మాత్రం రచ్చ రచ్చే..!!