ప్రభాస్ – మారుతి సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను రాబట్టాయి. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు ప్రభాస్. ఇక తాజాగా ” సలార్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు.

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా రాజ్యసభ అని పోస్టర్ కూడా విడుదలైంది. ఇక ఈ పోస్టర్ కింద సంగీతం అందిస్తుంది థమన్ అని రాసి ఉంది. ఇక ఇది చూసిన ప్రభాసభిమానులు ఆందోళనలో పడ్డారు. ఎందుకంటే తాజాగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాకి సైతం థమన్ సంగీతం అందించాడు.

ఇక ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఇక దీంతో ప్రభాస్ అభిమానులు టెన్షన్ లో పడ్డారు.” నీకు ఇండస్ట్రీలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం లేదా? అందరూ థమన్ మీదే పడుతున్నారు. వాడొక చెత్త మ్యూజిక్ డైరెక్టర్ ” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.