” సలార్ ” వేడుకలలో హాట్ టాపిక్ గా మారిన అఖిల్ ప్రెజెన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓచకోత కోసిందనే చెప్పొచ్చు.

 

ఇక రీసెంట్ గానే చిత్ర యూనిట్ సలార్ సక్సెస్ ని పార్టీలుగా చేసుకుంటున్న విజువల్స్ బయటకు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా మరోసారి తమ పార్టీ పిక్స్ ని మూమెంట్స్ నీ మేకర్స్ పంచుకోగా ఈ వేడుకలలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

అసలు సలార్ యూనిట్ కి అఖిల్ కి సంబంధం ఏంటి అని ప్రశ్న మొదటిగా వినిపిస్తుండగా ఊహించని విధంగా పార్ట్ 2 లో కానీ అఖిల్ ఉన్నాడా అనే ఇంట్రెస్టింగ్ రూమర్స్ ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అయితే తాను ఉన్నాడో లేదో కానీ తన ప్రజెన్స్ మాత్రం ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.