ఆ స్టార్ హీరో కూతుర్ని ఆడిస్తున్న అర్హ.. చాలా క్యూట్ గా ఉందంటున్న ఫ్యాన్స్.. ఫొటోస్ వైరల్..!

సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరికి ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. సాధారణమైన మనుషులే ఓ రేంజ్ లో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక అదే సినిమా హీరోలు, హీరోయిన్లు గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మెగా ఫ్యామిలీ ఈ సంక్రాంతిని అంగరంగ వైభోగంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. ఇక తాజాగా రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారికి క్లీన్ కారా అనే పేరును కూడా పెట్టారు. ఇక ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో తల్లిదండ్రులతో పాటు ఈ చిన్నారిని కూడా రెడీ చేసి ఆడిపించారు మెగా ఫ్యామిలీ.

ఇక ఈ తరుణంలోనే అల్లు అర్జున్ కూతురు అర్హ.. క్లీన్ కారాను ఆడిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముద్దు ముద్దు మాటలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న అర్హ.. మరోసారి తన చక్కటి చిరునవ్వుతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీటిని చూసి అల్లు ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.