ఫ్యాన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసి.. తుస్సుమనిపించిన స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమాలు ఇవే..

వెండితెరపై స్టార్ హీరోల మల్టీ స్టార‌ర్ సినిమాలు వస్తున్నాయని తెలిస్తే ఇరు వ‌ర్గాల‌ హీరోల‌ అభిమానులో సినిమాపై ఆటోమేటిక్‌గా అంచనాలు రెట్టింపు అయిపోతూ ఉంటాయి. వారు బడా స్టార్ హీరోలు అయితే ఇక ఆ సినిమాకు వచ్చే హైప్‌ మామూలుగా ఉండదు. అంతా హైప్ క్రియేట్ చేసిన తర్వాత కూడా అంచనాలకు తగ్గట్టు సినిమా లేకపోతే.. అభిమానుల డిసప్పాయింట్మెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటిదాకా అలా ఎన్నో మల్టీ స్టారర్‌ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరికొన్ని మాత్రం రిలీజ్‌కు ముందు భారీ హైప్ నెలకొని రిలీజ్ అయిన తర్వాత అట్టర్ ప్లాఫ్‌గా నిలిచాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వెండితెరపై రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచి ఫాన్స్‌ను డిసప్పాయింట్ చేసిన సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం.

Acharya Movie Review : అయ్యో.. ఆచార్య‌! - NTV Telugu

ఆచార్య:
మెగా వారసుడు రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కిన ఆచార్య సినిమా రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. తీరా రిలీజ్ అయిన తరువాత చెత్త కంటెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి.. ఫ్యాన్స్ ను తీవ్రంగా హర్ట్‌ చేసింది. ఫస్ట్ షో నుంచి డిజాస్టర్ టాక్ రావడంతో చివరికి నిర్మాతలకు ఈ సినిమాపై భారీ నష్టాలు వచ్చాయి.

Shankardada Zindabad (2007) - IMDb

శంకర్ దాదా జిందాబాద్:
శ్రీకాంత్ – చిరంజీవి కాంబోలో మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో రిలీజ్ కు ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా అతిధి పాత్రలో మెప్పించాడు. ఇక మొదట శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. దీంతో దీనికి సీక్వల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందని అంతా భావించారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ గా నిలిచి అంచనాలన్నింటిని తుస్సుమనిపించింది.

Sultan Fan Photos | Sultan Photos, Images, Pictures - FilmiBeat

సుల్తాన్ :
కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ మల్టీ స్టార‌ర్‌గా తెరకెక్కిన మూవీ సుల్తాన్. ఈ సినిమాపై రిలీజ్‌కి ముందు భారీ బజ్‌ వచ్చినప్పటికీ.. రిలీజ్ అయిన తర్వాత కమర్షియల్‌గా ఈ సినిమాకు సక్సెస్ రాలేదు.

Aswamedham - Telugu Movie Review, Ott, Release Date, Trailer, Budget, Box  Office & News - FilmiBeat

అశ్వమేధం :
రాఘవేంద్ర డైరెక్షన్లో శోభన్ బాబు, బాలకృష్ణ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ మూవీకి వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ ద‌త్‌ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Rama Krishnulu - Full Cast & Crew - TV Guide

రామకృష్ణులు :
సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబోలో జగపతి వి.రాజేంద్రప్రసాద్ డైరెక్ట్ చేసిన రామకృష్ణుడు సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా అమితాబచ్చన్, వినోద్ కన్నాల‌.. హేరా పేరు హిందీ సినిమాకు డబ్బింగ్‌గా తెరకెక్కింది. కృష్ణంరాజు చేసిన మల్టీస్టారర్ యుద్ధం కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.