” గుంటూరు కారం ” సక్సెస్ మీట్ పై నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

స్టార్ హీరో మహేష్ బాబు లేటెస్ట్ గా నటించిన మూవీ ” గుంటూరు కారం “. ఇక ప్రస్తుతం ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో మంచి టాక్, కలెక్షన్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కించగా హారిక హాసిని క్రియేషన్స్ వారు గ్రాండ్ లెవెల్ లో నిర్మించారు.

ఇక శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి సంబంధించి నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత నాగవంశీ. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ..” వాస్తవానికి తొలి రోజు ముందు అర్ధరాత్రి 1 గంటల షోస్ కి ఓకింత మిక్స్డ్ టాక్ రావడంతో టీం ఆలోచనలో పడ్డాం.

అయితే మహేష్ గారు తప్పకుండా మూవీ ఆడుతుంది మెల్లగా స్టార్ట్ అవుతుందని గట్టి నమ్మకంతో చెప్పారు. అనంతరం ఆయన చెప్పిన విధంగానే గుంటూరు కారం ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో నడవడం హ్యాపీగా ఉంది. ఇక రాబోయే వారంలో సక్సెస్ మీట్ నిర్వహిస్తాం. అప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కూడా మాట్లాడతారు ” అంటూ చెప్పుకొచ్చాడు నాగ వంశీ. ప్రస్తుతం నాగ వంశీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.