నాని ” సరిపోదా శనివారం ” మూవీ షూట్ లో జాయిన్ అయిన టాలెంటెడ్ యాక్టర్.. ఎవరంటే..!

ఇటీవల ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాని మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక దీని అనంతరం తాజాగా వినేక్ ఆత్రేయ తో నానిచేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సరిపోదా శనివారం “.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్, ఆడియన్స్ మెంట్ గ్లింప్స్ అందరిని ఆకట్టుకుని మూవీ పై మరిన్ని అంచనాలు పెంచేశాయి. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది.

ఇక ఈ మూవీలో కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ యస్ జె సూర్య నేడు సెట్స్‌ లో జాయిన్ అయినట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కాగా ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.