150 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ” హనుమాన్ “..!

యంగ్ అంటే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ముఖ్యపాత్రలో నటించిన మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ స్థాయిలో కలెక్షన్స్ను రాబడుతుంది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లులతో దూసుకుపోతున్న ఈ మూవీ లేటెస్ట్ గా 150 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఇదే విషయాన్ని మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. హనుమాన్ మూవీ కి రోజురోజుకి ఆదరణ పెరుగుతుంది. ఈ మూవీ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సెట్ చేయడం జరిగింది.

అలాగే ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ మరియు విజయ్ రాయ్ తదితరులు ఈ మూవీలో కీలకపాత్రను వహించారు. ఇక ఈ మూవీ లాంగ్ రన్ టైంలో మరింత వసూళ్లు రాబట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.