స్టోరీ చెప్పడానికి వెళితే ఆ ప్రొడ్యూసర్ తన వాచ్మెన్ కి చెప్పమన్నారు.. హ‌నుమాన్ డైరెక్ట‌ర్‌..?

ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియాలో రిలీజ్ అయిన మూవీ హనుమాన్. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా ప్రశాంత్ వర్మకు ఊహించని స్థాయిలో సక్సెస్ వచ్చింది. హనుమాన్ సినిమా సక్సెస్ తో ప్రశాంత్ వర్మ పేరు ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మారు మోగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై సందడి చేశారు. తక్కువ బడ్జెట్ తో సినిమా అంటే చాలామంది నిర్మాతలు రెడీగా ఉంటారని.. ఆయన మాట్లాడాడు. ఆ సినిమాకు నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని ప్రశాంత్ వర్మ వివరించాడు.

ఇండస్ట్రీలో అన్ని రకాల అవమానాలను నేను చూశానని చెప్పుకొచ్చిన ప్రశాంత్ వర్మ.. మాట్లాడుతూ స్టోరీ చెప్తానంటే నిద్రపోయిన నిర్మాతలు ఉన్నారని వివరించాడు. ఒక ప్రొడ్యూసర్ రాత్రి రెండు గంటల సమయంలో కథ వింటానని చెబితే వెళ్లానని.. ఆయన ముందు సెట్టింగ్ పెట్టుకుని కథ చెప్పమన్నారని కామెంట్ చేశాడు. ఆరోజు రెండు మూడు కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లానని వివరించాడు. కొంతమంది నిర్మాతలు వాచ్మెన్ కు, ఆఫీస్ బాయ్ కు కదా చెప్పాలని కోరారని.. నా జీవితం మొత్తంలో ఇప్పటివరకు 300 నుంచి 400 నరేషన్‌లు ఇచ్చానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.

సినిమా అనేది ఒక ట్రావెల్ అని నాకు ఇచ్చిన బౌన్స్ ఆయన చెక్కులు ఎన్నో ఉన్నాయని వివరించాడు. మార్నింగ్ స్టార్టై ఈవినింగ్ ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చిన ప్రశాంత్ వర్మ.. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ సెట్ కు వస్తున్నాడని చెప్పి సినిమా చేయనని హీరోలు చెప్పినా సందర్భాలు కూడా ఉన్నాయని వివరించాడు. ప్రశాంత్ వర్మ వివరించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మకు మరిన్ని ఆఫర్లు క్యూ కట్టే అవకాశం ఉంది. కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంతో ఎన్నో కష్టాలు పడ్డానని ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.