అసలు ప్రభాస్ ఎలా బతుకుతాడో అనిపించింది.. సలార్ యాక్టర్ శ్రియ రెడ్డి కామెంట్స్ వైర‌ల్‌..?!

బ్యూటిఫుల్ స్టార్ యాక్టర్స్ శ్రియ రెడ్డి ఇటీవల స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ స‌లార్‌ లో కీలకపాత్రలో నటించి మెపించిన ఈ ముద్దుగుమ్మ అందరి ప్రశంసలు అందుకుంది. తర్వాత పవన్ కళ్యాణ్ ఓజితో రాబోతున్న ఈమె.. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

అంత‌ స్టార్ డం ఉన్న వ్యక్తి ఎంతో సింపుల్గా ఎలా ఉంటాడని అనిపించిందని.. ఇంత మంచి మనుషులు కూడా ఉంటారా అనుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఇలా ఉంటే ఎలా బతుకుతాడు అని భావించానని.. అయితే భగవంతుడు ఆయనకు అంత గొప్ప పొజిషన్ కూడా అందుకే ఇచ్చి ఉంటాడేమో అంటూ చెప్పుకొచ్చిన‌ శ్రేయ రెడ్డి.. ఆయనతో మాట్లాడుతుంటే నాకు ఒక గొప్ప ఫీల్ కలుగుతుందని.. సినిమా షూటింగ్ లో తన అనుభవాలను వివరించింది.

కాగ శ్రియ రెడ్డి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒజీలో మరో అద్భుతమైన రోల్ లో కనిపించబోతుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్క‌బోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి రీసెంట్గా శ్రీయ రెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. పవన్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందంటూ ఓజి సినిమాపై శ్రీయ రెడ్డి కామెంట్ చేయ‌టం విశేషం.