‘ గుంటూరు కారం ‘ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మాస్ ఆడియన్స్ కు పండగే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ బ్యూటీ శ్రీలీల హీరో హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ గ్రాండ్గా జరిగాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్, ట్రైలర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కుర్చీ మడత పెట్టి అనే మాస్ సాంగ్ కు విమర్శలు వచ్చిన బజ్‌ బాగా క్రియేట్ అయింది. ఇక ఇటీవల సినిమా సెన్సార్ టాక్ పూర్తి చేసుకుంది. గుంటూరు కారం సినిమాకు సెన్సార్ బోర్డు యూఎ సర్టిఫికెట్ను అందించింది.

అలాగే సినిమాలో ఎలాంటి కట్స్ లేకుండా సినిమాను సెన్సార్ పూర్తి చేశారు. 2:30 నడివితో కొనసాగుతున్న ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ 85 నిమిషాలు, సెకండ్ హాఫ్ 74 నిమిషాలుగా తెలుస్తుంది. కాగా కొన్ని డైలాగ్స్ మాత్రం సినిమాలో మ్యూట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా ప్రింట్స్‌ ఇప్పటికే ఓవర్సీస్ లో డెలివరీ అయ్యాయట. దుబాయ్ లో కూడా గుంటూరు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ రానే వచ్చేసింది. మూవీ క్రిటిక్ దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు అని చెప్పుకుంటూ ఉండే సెన్సేషనల్ క్రిటిక్ ఉమైర్ సంధు.. గుంటూరు కారం మూవీ రివ్యూ ఇచ్చాడు.

ఓవర్సీస్ సెన్సార్ బోర్డు నుంచి గుంటూరు కారం మూవీ ఫస్ట్ రివ్యూ.. మహేష్ బాబుతో ఎంటర్టైన్మెంట్ హై లెవెల్ లో ఉంది. సినిమాలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే మాసాల ఎలిమెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. మాస్ పీపుల్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. రూల్స్ తిరగరాసే సినిమా గా మహేష్ కెరియర్ లో ఉండనుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాకు రేటింగ్ ఇస్తూ 5 కి 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాకు పోటీగా తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైంధ‌వ్‌, నాగార్జున నా స్వామి రంగా సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో బ్లాక్ బస్టర్ హిట్ ఏ సినిమా కొడుతుందో చూడాలి.