‘ హనుమాన్ ‘ రిలీజ్ కు అమావాస్య ఎఫెక్ట్.. రిలీజ్ ఆపడానికి కారణం అదే.. బయటపడ్డ సీక్రెట్..

సంక్రాంతి బ‌రిలో ముందుగా ఐదు సినిమాలో ఉంటాయని అందరు భావించారు. అయితే థియేటర్ల సర్దుబాటు కారణంగా ఈగిల్ సినిమా వెనక్కు తగ్గింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అంగీకరించారు. జనవరి 12న రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కాకుండా ఒక్కో సినిమా ఒక్కరోజు రిలీజ్ అయితే థియేటర్స్ సర్దుబాటు వ్యవహారం కాస్త ఈజీగా అవుతుందని అందరు భావించారు. కాగా తము ముందుగా ప్రకటించామని.. హనుమాన్ మేకర్స్ 12వ తేదీనే సినిమాను రిలీజ్ చేయడానికి పట్టుబ‌ట్టారు.

అప్పటికే హిందీలో తమ డిస్ట్రిబ్యూటర్లు అగ్రిమెంట్లు ముందే చేసుకున్నారు కాబట్టి పోస్ట్ పన్‌ చేసే అవకాశం లేదని టీం తేల్చి చెప్పేశారు. గుంటూరు కారం టీం నుంచి ఎవరు స్పందించలేదు. కానీ తమది ఎలాగూ స్టార్ హీరో సినిమా కాబట్టి థియేటర్ల కొరత ఉండదని భావించి ఉండవచ్చు. కాగా 11వ తేదీనే హనుమాన్ కొన్ని ప్రీమియర్ షోస్‌ వేస్తుంది. దాదాపు 300 కు పైగా షోస్ వేస్తున్నట్లు టికెట్లు ఆన్లైన్ లో పెడితే అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినట్లు ప్రకటించింది. అలాంటప్పుడు 11వ తేదీన సినిమాని రిలీజ్ చేయవచ్చు కదా అని దర్శకుడు ప్రశాంత్ వర్మకు తాజాగా ఓ ప్రశ్న ఎదురైంది.


11వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత మాత్రమే హనుమాన్ సినిమా ప్రీమియర్ ఓపెన్ అవుతాయని.. ఎందుకంటే ఐదున్నర వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయని.. ఆ కారణంగానే 11వ తారీఖున సినిమాను రిలీజ్ చేయలేదని వివరించాడు. ఆ అమావాస్య గడియలు దాటిన తరువాత మాత్రమే హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తమ సెంటిమెంట్‌తో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా పాజిటివ్ టాక్‌ వస్తుందని నమ్మకం మాకు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి