హనుమాన్ కి కలిసొచ్చిన రిపబ్లిక్ హాలిడే.. కలెక్షన్లలో సరికొత్త రికార్డ్..

సంక్రాంతి బ‌రిలో రిలీజై బ్లాక్ బ‌స్టర్ సాధించిన మూవీ హనుమాన్. తేజ స‌జ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ సినిమాలో అమృత అయ్య‌ర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక రిలీజ్‌కు ముందే బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా అదే రేంజ్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

ఇప్పటికే రెండు వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న హనుమాన్.. 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లు కలెక్షన్లను సాధించి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విఫ‌యాని స్వ‌యంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. కాగా ముందుగా హనుమాన్‌కు ఊహించిన స్థాయిలో స్క్రీన్లు లభించలేదు. నైజాం, ఆంధ్రలో పరిమితమైన స్క్రీన్ లతో సినిమాను రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 450 స్క్రీన్ లతో, హిందీలో 1500 స్క్రీన్ లతో ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్ లతో మొదటి వారం హనుమాన్ ప్రదర్శించారు.

అయితే రిలీజ్ అయిన తర్వాత మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో భారీగా స్క్రీన్లు పెరిగాయి. ప్రస్తుతం 4500 నుంచి 5000 మంది స్క్రీన్ లలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇక ఇప్పటికీ సినిమా ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఈ వారంలో కొత్తగా తెలుగు సినిమాలు రిలీజ్‌ ఏం లేకపోవడంతో.. అలాగే నిన్న రిపబ్లిక్ డే హాలిడే కావడంతో సినిమాకు కలెక్షన్స్ భారీగా వచ్చాయి. ఇక తాజాగా రూ.250 కోట్లు రికార్డ్ క్రియేట్ చేసిన హనుమాన్ త్వరలోనే రూ300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.