రణబీర్ ‘ రామాయణం ‘లో విభీషణుడిగా ఆ స్టార్ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇటీవల యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బ‌స్టర్ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రణ్‌బీర్ కపూర్ రామాయణంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా మూడు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇక‌ ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ సినిమాకు సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే కోలీవుడ్ సెన్సేషన్ యష్‌ను సినిమాలో రావణాసురుడు పాత్రకు ఎంచుకున్నారట. అలా హనుమంతుడిగా సన్నీ డియోల్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్ ని తీసుకున్నార‌ట‌. ఇక కైక పాత్ర కోసం లారా దత్తాను తీసుకున్నట్లు సమాచారం.

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని ఈ సినిమాలో విభీషణుడు పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ వార్తలో నిజ‌మెంతో తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు పూర్తిగా మేకర్స్ రిలీజ్ చేసే వరకు వేచి చూడాలి.