హనుమాన్ నా బాధ్యతను మరింత పెంచింది.. ఆమె ఈ సినిమాకు లక్కీ చార్మ్ .. ప్రశాంత్ వర్మ

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన మూవీ హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కాగా ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ఓ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు మేకర్స్.

ప్రశాంత్ వర్మ ఆ ఈవెంట్లో మాట్లాడుతూ హనుమాన్ కి వచ్చిన స్పందన నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.. ఇది నాకు ఇంకా సినిమాలపై బాధ్యతను పెంచింది.. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వచ్చి సినిమాను చూసే విధంగా ఇకపై సినిమాలు తెరకెక్కిస్తాను అంటూ వివరించాడు ప్రశాంత్ వర్మ. మా సినిమాను ఇంతలా ఆదరించినందుకు ప్రేక్షకుల అభినందనలు అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా కు ఆ రేంజ్‌లో సక్సెస్ వచ్చిందంటే అది మీ కారణంగానే.. మీ రుణం ‘ జై హ‌నుమాన్‌ ‘తో తీర్చుకోబోతున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక‌ హ‌నుమాన్‌తో త‌న స్నేహితుడు తేజ సర్జ స్టార్‌హీరోగా మారడం చాలా సంతోషాన్ని కల్పిస్తుందని.. అమృత అయ్యర్ ఈ సినిమాల్లో చాలా అద్భుతంగా నటించిందని వివరించాడు. ఇక ఈ సినిమాకు వరలక్ష్మి శరత్ కుమార్ లక్కీ చార్మ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.