తేజ సజ్జ కి ఒక్క సినిమాతోనే తోక పెరిగిపోయిందా..? కొత్త సినిమాలకి అలాంటి కండిషన్స్ పెడుతున్నాడా..?

తేజ సజ్జ..  ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.  సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న తేజ ..ప్రెసెంట్ హీరోగా సినిమాలలో నటిస్తున్నాడు.  రీసెంట్గా ఆయన నటించిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు హనుమాన్ సినిమా ఆయనకు ప్రత్యేక ప్రశంసలు దక్కేలా చేసింది .

రీసెంట్గా ఈ సినిమా 250 కోట్లు కలెక్ట్ చేసింది.  ప్రజెంట్ సోషల్ మీడియాలో తేజ సజ్జా కి సంబంధించిన ఒక మేటర్ వైరల్ గా మారింది . తేజ సజ్జ 50 లక్షలు,  కోటి రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకుంటూ వచ్చేవారు . అయితే ఇప్పుడు ఆయన ఆ రెమ్యూనరేషన్ ని రెండు కోట్లు చేసేసినట్లు తెలుస్తుంది.  సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

కొందరు తేజ సజ్జాకు హెడ్ వెయిట్ పెరిగిపోయింది ..అంటుంటే మరికొందరు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటున్నారు. మొత్తానికి హనుమాన్ సినిమా తేజకు బాగానే కలిసి వచ్చింది . చూద్దాం ఫ్యూచర్లో ఎలాంటి హిట్స్ అందుకుంటాడో..? ప్రెసెంట్ తేజ సజ్జా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు..!!