దిల్ రాజు కెరీర్ సక్సెస్ అవ్వడానికి ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందా.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గారు రాణిస్తున్న దిల్ రాజుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయ‌న‌ నిర్మించిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు సక్సెస్ సాధించడంతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన దిల్ రాజు.. డిస్ట్రిబ్యూటర్ గా సైతం విజయవంతంగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న దిల్ రాజు.. ఫ్యూచర్లో ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎంతోమంది కొత్త డైరెక్టర్లను టాలీవుడ్‌కి పరిచయం చేసిన దిల్ రాజు ఆ డైరెక్టర్లు సక్సెస్ కావడంలో కీలకపాత్ర పోషించారు.

దిల్ రాజు పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ గా మారిపోయింది అనడంలో సందేహం లేదు. అయితే దిల్ రాజు తన కెరీర్‌లో ఈ రేంజ్‌లో సక్సెస్ అందుకోవడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆది మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర, బాంబులు వేసే సీన్, సుమోలు పేలే సీన్స్ హైలెట్ గా ఉంటాయి. వాస్తవానికి రెండు సీన్లు మాత్రమే చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ని సినిమాలో నటించడానికి వినాయక్‌ ఒప్పించారు. అయితే కొన్ని ఏరియాలో ఈ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు.

ఈ సినిమాకు ముందు.. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేసిన పలు సినిమాలకు ఆశించిన రేంజ్‌లో ఫలితం దక్కలేదు. అయితే ఆది.. సినిమా సక్సెస్ తో దిల్ రాజు దశ మారినట్లు అయింది. ఈ విధంగా దిల్ రాజు కెరీర్ సక్సెస్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా పాత్ర వహించారు. ఆది సినిమాను వినాయక్‌ అద్భుతంగా తెరకెక్కించడంతో దిల్ రాజు.. వినాయక్ తో దిల్ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మొదటి సినిమాతోనే సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం దిల్ రాజుకు సొంతంగా థియేటర్లు కూడా ఉండడంతో ఆ థియేటర్ల ద్వారా కూడా కళ్ళు చేదిరేస్థాయిలో లాభాలను అర్జిస్తున్నాడు.