ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా టచ్ చేయలేకపోయినా సీనియర్ ఎన్టీఆర్ రేర్ రికార్డ్ ఇదే.. బ్రేక్ చేయడం చాలా కష్టం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోల లిస్ట్ లో మొదటి వరుసలో ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు ప్రశంసల వర్షం కురుస్తూనే ఉండేది. ఆరెంజ్ లో ఆయన నటనకు గుర్తింపు వచ్చింది. దర్శకులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చే అతి కొద్ది మంది హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. వెండితెర నట సార్వభౌముడిగా.. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలనుకునే చాలామందికి ఇన్స్పిరేషన్ గా సీనియర్ ఎన్టీఆర్ ఉంటారు. కాలేజీలో చదివే రోజుల్లోనే ప‌లు నాటకాల‌లో స్త్రీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు.

కథ నచ్చితే ఏ సినిమాలోనైనా సీనియర్ ఎన్టీఆర్ డీ గ్లామ‌ర‌స్‌ రోల్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉండేవాడు. తాత తరహా పాత్రల్లో నటించి నటుడుగా తాను ఏ పాత్రనైనా చాలెంజింగ్ గా తీసుకుని చేయగలనని నిరూపించుకున్నారు. కష్టం విలువ తెలిసిన కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్ కరువుకాట‌కాల్లో అల్లాడిన బాధితులను ఆదుకునే విషయంలో ఎప్పుడూ ముందుండే వారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఓ చెక్కుచెదరని రికార్డు కూడా ఉంది. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా టచ్ చేయలేకపోయినా ఆ రికార్డ్ ఏంటో ఓ సారి చూద్దాం. ఒకే ఏడాదిలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు వరుసగా ఇండస్ట్రియల్ హిట్గా నిలిచాయి.

ఈ తరం హీరోలలో చాలామంది పదేళ్లకు ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడం కూడా సాధ్యపడడం లేదు. 1977 సీనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో చాలా స్పెష‌ల్ అని చెప్పాలి. ఆ ఏడాది విడుదలైన వరుస సినిమాలు దానవీరశూరకర్ణ, అడవి రాముడు, యమగోల ఈ మూడు కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డులు సృష్టించాయి. అయితే ఇప్పటివరకు ఆ రికార్డును మరే హీరో కూడా దాటలేకపోయారు. సీనియర్ ఎన్టీఆర్ నటనను అభిమానించే అభిమానులు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నందమూరి వార‌సులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి రాణిస్తున్నారు.