ప్రభాస్ – మారుతి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. లుంగీలో చిల్ లుక్‌తో అదరగొడుతున్న డార్లింగ్ .. టైటిల్ ఏంటంటే..?

ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో తెర‌కెక్కిన మూవీ గురించి ప్రేక్షకుల్లో కూడా ఎప్పటి నుంచి ఆసక్తి నెలకొంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెర‌కెక‌నుందని మారుతి ఇదివరకే వివరించిన సంగతి తెలిసిందే. కొంతమంది ఫ్యాన్స్ ఇది ప్రభాస్ రేంజ్‌ మరింత పెంచుతుందని భావిస్తున్నారు. మరికొందరు ఇలాంటి టైంలో ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్.. అది కూడా చిన్న సినిమాను చేయడం ప్రభాస్‌కు సరిపడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సినిమా సైలెంట్ గా సెట్స్‌ పైకి వచ్చి కొంత భాగం షూటింగ్ కూడా జరిపేసుకుంది. ఇక సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టారు. మేకర్స్ ఈ సినిమాకు ది రాజా సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. స్క్రీన్ పై తన కామెడీ చూసి చాలా కాలం అయిపోయింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి దిగిపోయాడు. మధ్యలో రాదేశ్యామ్‌ సినిమాలో కనిపించినా.. లవ్ ట్రాక్ తప్ప కామెడీ ట్రాక్ ఏ కోసానా లేదు. మారుతి సినిమాలు అంటేనే కామెడీకి పెట్టింది పేరు.

కాబట్టి ది రాజా సాబ్‌లో కామెడీ టైమింగ్ తో ప్రభాస్ మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకుపోతున్నాడని అర్థమవుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ప్రభాస్ గత సినిమాలా కాకుండా లుంగీలో కూల్ , కలర్ ఫుల్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ లుక్ ను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ మిల్స్ తిన్నట్లుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్‌ను ఇలాంటి చిల్ లుక్‌లో చూస్తున్నామంటు సంతోష పడుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.